"భారత్ రైస్"ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

by Mahesh |   ( Updated:2024-02-07 13:48:05.0  )
భారత్ రైస్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో విపరీతంగా పెరుగుతున్న బియ్యం ధరలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పేదలకు రూ. 29 కేజీ బియ్యాన్ని అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఏజేన్సీల సహాయంతో భారత్ రైస్ పేరు మీద ఫిబ్రవరి ఆరు నుంచి రూ. 29 కేజీ బియ్యాన్ని అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ రైస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో పీయూష్ గోయల్ జెండా ఊపీ ఈ భారత్ రైస్ వ్యాన్లను ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్‌సీసీఎఫ్ కేంద్రీయ భండార్ ఔట్ లెట్లలో, మొబైల్ వ్యాన్‌లలో ఈ భారత్ రైస్‌ను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటుగా ఆన్‌లైన్‌లో ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్, లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో కూడా భారత రైస్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో సామాన్య ప్రజలకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా అన్నం ఎక్కువగా తినే తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల ప్రజలకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.

దేశ ప్రజలకు మెరుగైన ధరలకు ఆహార పదార్థాలు అందించడానికి ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నారు. ఇందులో భాగంగా.. భారత్ రైస్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Advertisement

Next Story