ఈడీకి సుప్రీంకోర్టు షాక్..ఆ టైంలో నిందితులను అరెస్టు చేయొద్దని వెల్లడి

by samatah |
ఈడీకి సుప్రీంకోర్టు షాక్..ఆ టైంలో నిందితులను అరెస్టు చేయొద్దని వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోదక చట్టం కింద ప్రత్యేక కోర్టు ఫిర్యాదును విచారణకు స్వీకరించిన తర్వాత ఈడీ సెక్షన్ 19 కింద అధికారాలను ఉపయోగించి నిందితులను అరెస్టు చేయలేదని వెల్లడించింది. అటువంటి నిందితుడిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తే..స్పెషల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు గురువారం ఓ కేసులో భాగంగా న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈడీ సమన్ల మేరకు నిందితుడు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరైనప్పుడు.. ఆయనను కస్టడీకి తీసుకోవాలంటే తప్పనిసరిగా సంబంధిత కోర్టుకు అప్లై చేసుకోవాలని తెలిపింది. అప్పుడు సరైన కారణాలను పరిశీలించిన తర్వాత కోర్టు అనుమతిస్తే మాత్రమే కస్టడీకి తీసుకోవచ్చని పేర్కొంది. అంతేగాక ఈడీ సమన్ల తర్వాత స్వచ్ఛందంగా ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యే నిందితులు బెయిల్ కోసం పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45లో పేర్కొన్న కఠినమైన ప్రమాణాలను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిందితుడు కోర్టు జారీ చేసిన సమన్లతో స్పెషనల్ కోర్టు ముందు హాజరైనట్టైతే అతను కస్టడీలో ఉన్నట్టు పరిగణించబడదని, కాబట్టి సెక్షన్ 45 వర్తించదని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story