జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

by Mahesh |   ( Updated:2023-02-13 08:35:39.0  )
జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల విభజనను సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మా ఈ తీర్పు.. ఆర్టికల్ 370కి సంబంధించిన కేసులపైనా, కోర్టులో పెండింగ్‌లో ఉన్న జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడంపైనా ఈ తీర్పు ప్రభావం చూపబోదని ధర్మాసనం కోర్టు పేర్కొంది.

డీలిమిటేషన్ అనేది కాలానుగుణంగా జనాభాలో మార్పులను సూచించడానికి అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానాల సరిహద్దులను పునర్నిర్మించే చర్య. కేంద్రం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ గత ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్‌లో డీలిమిటేషన్ కోసం తన తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఏడు అదనపు నియోజకవర్గాలను ఎర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో జమ్మూకి ఆరు, కాశ్మీర్‌కు ఒకటి, కాగా మొత్తం సీట్ల సంఖ్యను 90కి చేర్చింది. అంతకు ముందు దీని సంఖ్య 83గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed