- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: ప్రధాని మోడీకి పదవీ గండం తప్పదా.. నెక్ట్స్ ఇండియాకు PM ఆయనేనా..?
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సర్టిఫికెట్ల అంశం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆయన గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను పీఎంవో బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తేల్చిచెప్పినప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో మోడీని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మోడీకి పదవీ గండం తెచ్చిపెడుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ మోడీ సర్టిఫికెట్ ఫాల్స్ అని తేలితే చట్టప్రకారం అతడి పార్లమెంట్ సభ్యత్వాన్ని డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ అనుకూల వర్గం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది.
గతంలో అయోధ్యకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీ నకిలీ డిగ్రీని సబ్మిట్ చేసినందుకు ఆయనకు శిక్ష ఖరారు అయిందని.. అందువల్ల మోడీకి సంబంధించిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలితే ప్రధాని పదవి ఊస్ట్ ఖావడం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో మోడీ పీఎంగా దిగిపోతే ఆ పదవి ప్రస్తుత కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ఇస్తారనే టాక్ ఢిల్లీ సర్కిల్స్‌లో జరగుతోందనే ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. మొత్తంగా మోడీ సర్టిఫికెట్ల వ్యవహారం ఏ తీరం చేరుతుందో అనేది ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది.