- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Gold Mine:ఆ రాష్ట్రంలో బంగారు గని..ఎట్టకేలకు బయటపడ్డ సంచలన రహస్యం!
దిశ,వెబ్‌డెస్క్:చాలా ఏండ్ల తర్వాత ఆ రాష్ట్రంలోని సంచలన రహస్యం తాజాగా బయటపడింది. ఒడిశా రాష్ట్రంలో బంగారు గని ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఉక్కు గనుల శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు. రాష్ట్రంలో బంగారు గని ఉన్నట్లు కనుగొన్నారని ఆయన తెలిపారు. సర్వేలో ఈ విషయం వెల్లడైందని తాజాగా గనుల శాఖ మంత్రి చెప్పడంతో ఈ విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ గనిలో పెద్దయెత్తున బంగారు నిల్వలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. సర్వేలో..కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ వాహినీపతి అడిగిన ప్రశ్నకు గనుల శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే..డియోగఢ్ జిల్లాలోని ఆదాష్-రాంపల్లి ప్రాంతంలో కాపర్ ఓర్ తో పాటు బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సర్వేలో తేలిందని గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు తారా ప్రసాద్ బాహినిపతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ బ్లాక్ వేలానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కియోంజార్ జిల్లాలోని గోపూర్-గజిపూర్ ప్రాంతంలో 1981-83 నుంచి 1989-96 మధ్య ప్రాథమిక సర్వే తో పాటు 2021-22 నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో సంయుక్త సర్వేలు జరిగాయని మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు. అక్కడ ఎంత మొత్తం బంగారం నిక్షేపాలు ఉన్నాయన్న విషయమై అంచనా వేయలేదన్నారు. ప్రజెంట్ ఇక్కడ బంగారం ఉందని తేలడంతో తవ్వకాలను ప్రారంభించి బంగారు నిల్వలు వెలికి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.