- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దళిత యువతి దారుణ హత్య.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని అయోధ్యలో ఓ దళిత యువతి హత్యకు గురవడం కలకలం రేపుతోంది. అసలు విషయం ఏమిటంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో అదృశ్యమైన 22 ఏళ్ల దళిత యువతి శవమై ఓ కాలువలో దొరికింది. ఒంటిపై దుస్తులు లేకుండా ఉండగా , శరీరంపై తీవ్రమైన గాయాలు, విరిగిన ఎముకలు ఉన్నాయి. ఆమె చేతులు, కాళ్లు తాళ్లతో కట్టబడి ఉండగా శవాన్ని తరలించే సమయంలో ఆమె కాలు విరిగిందని గమనించారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన పై స్థానిక ఎంపీ(Ayodhya MP) అవదేష్ ప్రసాద్(Awadhesh Prasad) భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఈ రోజు(ఆదివారం) ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్యకు సమీపంలో లైంగికదాడి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబానికి న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ముందు లేవనెత్తుతామని ఉద్వేగంతో చెప్పారు. కాగా అదృశ్యమైన సదరు యువతి నిన్న మృతదేహమై కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.