వచ్చే ఏడాదే ది ఢిల్లీ ఫైల్స్ రిలీజ్.. బిగ్ అప్డేట్ చెప్పిన డైరెక్టర్

by Shamantha N |   ( Updated:2024-04-22 14:55:13.0  )
వచ్చే ఏడాదే ది ఢిల్లీ ఫైల్స్ రిలీజ్.. బిగ్ అప్డేట్ చెప్పిన డైరెక్టర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ది కశ్మీర్ ఫైల్స్‌తో ఫేం అందుకున్న డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన నెక్ట్ మూవీ గురించి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ది ఢిల్లీ ఫైల్స్ మూవీ రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు. ఓ యూజర్ ట్వీట్ కు రిప్లయ్ ఇస్తూ.. ఈ విషయాన్ని ప్రకటించారు ఫిలిం మేకర్. అంతే కాకుండా.. తన మూవీలోని నటుల గురించి కూడా మాట్లాడారు వివేక్ అగ్నిహోత్రి. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి, ది ఢిల్లీ ఫైల్స్.. మూవీ షూటింగ్ ఆన్ టైంలో జరుగుతోందని స్పష్టం చేశారు వివేక్ అగ్నిహోత్రి. వచ్చే ఏడాదే ఈ మూవీ విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇందులో పెద్ద స్టార్స్ ఎవరూ లేరని.. కానీ కంటెంట్ మాత్రమే హీరో అని చెప్పుకొచ్చారు.

ఇకపోతే, మూవీ సబ్జెక్ట్, స్టోరీపైనే ఈ డైరెక్టర్ దృష్టి పెడ్తాడు. పెద్ద స్టార్స్ లేకపోయినప్పటికీ కంటెంట్ నే హీరోగా చేస్తాడు. ది ఢిల్లీ ఫైల్స్ మూవీతో మరింత ఎంటర్ టైన్ చేయనున్నట్లు ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు వివేక్ అగ్నిహోత్రి.

Read More...

‘కూలీ’గా మారిపోయిన రజినీకాంత్.. వీడియో వైరల్

Advertisement

Next Story