Bihar : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆరుగురికి ఛాన్స్ !

by Y. Venkata Narasimha Reddy |
Bihar : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆరుగురికి ఛాన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్(Bihar) సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar)తన మంత్రివర్గాన్ని విస్తరించాల(Cabinet Expansion)ని నిర్ణయించుకున్నారు. బీహార్ లో ఈ ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections)లు జరగనున్నాయి. ఈ తరుణంలో బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు.

బీహార్ రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్ బుధవారం (ఫిబ్రవరి 26) తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కేబినెట్ విస్తరణ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. నేడో రేపో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధికార పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ, జేడీయూ కూటమి ప్రభుత్వం బీహార్ లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం నితీష్ కుమార్ ల మధ్య చర్చలు ముగిశాయి.

కేబినెట్ విస్తరణలో భాగంగా ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రి మండలిలోకి తీసుకోనున్నట్లు సమాచారం. బీహార్ శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్య ప్రకారం గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం నితీష్ మంత్రివర్గంలో 30 మంది మంత్రులు ఉండగా..బీజేపీ నుంచి 15 మంది, జేడీయూ నుంచి 13, ఇతరులు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణ చేసి.. ఆరుగురిని కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నుంచి నలుగురు, జేడీయూ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన దిలీప్ జైస్వాల్ ను బీజేపీ అధిష్టానం జనవరి 18న బీహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో అతడి సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ హైకమాండ్ వెల్లడించింది.



Next Story