- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ కోర్టు తీర్పు.. స్వాగతించిన బీజేపీ MP
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాకిచ్చింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను హైకోర్టు రద్దు చేసింది. ఈ సర్టిఫికెట్లన్నీ చట్టవిరుద్ధమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. తాజాగా కోల్‌కతా హైకోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోల్‌కతా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం బెంగాల్ విధానమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉందని కీలక ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపారు. కర్ణాటకలోనూ వర్తిస్తుందని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలని అన్నారు. తెలంగాణలో బీసీ-ఈ పేరు మీద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీంతో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు కోల్‌కతా కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను ఓబీసీ జాబితా నుంచి తొలగించేలా వారు (బీజేపీ) ఈ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. దీనిని అంగీకరించేది లేదని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందన్నారు.