ఆమెజాన్ సమావేశాల్లో ఆ ఒక్క కుర్చీ ఖాళీనే

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-21 10:15:55.0  )
ఆమెజాన్ సమావేశాల్లో ఆ ఒక్క కుర్చీ ఖాళీనే
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఇ- కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంస్థ వ్యాపారాభివృద్ధిలో అనుసరించే వ్యూహాలు వ్యాపార రంగంలో ఆసక్తి రేపుతుంటాయి. ఆయన వ్యాపార వ్యూహాల్లో అనుసరించే ఓ వ్యూహాం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెజాన్ వ్యూహాత్మక వ్యాపారానికి సంబంధించి నిర్వహించే ప్రతి సమావేశంలోనూ ఒక కుర్చీని ఖాళీగా ఉంచడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బెజోస్ ఎందుకు అలా ఓ కుర్చీని ఖాళీగా ఉంచుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆ ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తుచేస్తుందని... ప్రతీ సమావేశంలోనూ కస్టమర్లను ఆ కుర్చీ ద్వారా గుర్తుకు తెచ్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తుందట. బెజోస్ అనుసరిస్తున్న ఈ వ్యూహాం ఇతరులకు చూసేందుకు విచిత్రంగా అనిపించినప్పటికీ దీని ప్రభావం ఎక్కువగా సమావేశాల్లో గణనీయంగా ఉండేదట. కస్టమర్లకే తమ సంస్థ మొదటి ప్రాధాన్యమన్న సంగతికి ఈ ఖాళీ కుర్చీ వ్యవహారం ఉద్దేశమని ఆయన భావన. అదిగాకుండా ఎక్కువమందితో మీటింగ్ ఏర్పాటు చేయడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వంటివి బెజోస్ తన సమావేశాల్లో నిషేదించారు. సమావేశాల్లో పాల్గొనేవారు కేవలం బుల్లెట్ పాయింట్ ఫార్మాట్లో లేదా మెమోలుగా సమాచారాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రతీ సమావేశంలో పాల్గొనేవారంతా మొదట అందుబాటులో ఉన్న వివిధ అంశాల గురించి చదవాలని, ఇదంతా లోతైన అధ్యయనానికి, నిశ్శబ్ద పఠనం, ఏకాగ్రత సాధనకు ఉపరిస్తుందని బెజోస్ భావిస్తారు.

Advertisement

Next Story

Most Viewed