మా మధ్య ఏ గొడవలు లేవు

by Ajay kumar |
మా మధ్య ఏ గొడవలు లేవు
X

- మహాయుతిలో విభేదాలను కొట్టిపారేసిన శిండే

- ఫడ్నవీస్, అజిత్ పవర్‌తో కలిసి శిండే ప్రెస్ మీట్

- మహాయుతి ఐక్యంగా ఉందని సందేశం

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే అన్నారు. నాకు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమని.. మా మధ్య అంతా 'థండా థండా కూల్ కూల్' అని వ్యాఖ్యానించారు. తనను తేలిగ్గా తీసుకోవద్దని.. గతంలో ఇలా తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వాన్ని కూల్చిన విషయం గుర్తుంచుకోవాలంటూ గత వారం ఏక్‌నాథ్ శిండే వ్యాఖ్యానించారు. దీంతో మహాయుతి సర్కార్‌లోని పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో కలిసి ఏక్‌నాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శిండే మాట్లాడుతూ 'మీరు (మీడియా) మా మధ్య విభేదాలు ఉన్నాయని ఎంత గట్టిగా ప్రచారం చేసినా మా కూటమి విచ్ఛిన్నం కాదు' అంని అన్నారు. మహాయుతిలో అసమ్మతి ఉందనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఎండలు ఇంత మండిపోతుండగా మా మధ్య కోల్డ్ వార్ ఎలా ఉంటుంది? అంతా థండా థండా కూల్ కూల్ అంటూ చలోక్తి విసిరారు. కేవలం నేను, ఫడ్నవీస్ మాత్రమే తమ పాత్రలను మార్చుకున్నాను. అజిత్ పవార్ గతంలో ఉన్న పదవిలోనే ఉన్నారు. ఎంవీయే ప్రభుత్వం ఆపేసిన అనేక ప్రాజెక్టులను మేం తిరిగి ప్రారంభించామని శిండే అన్నారు.



Next Story

Most Viewed