Terrorist Attack : శౌర్య చక్ర గ్రహీత ఇంటిపై ఉగ్రదాడి..సైన్యం కాల్పుల్లో టెర్రరిస్టు మృతి

by vinod kumar |
Terrorist Attack : శౌర్య చక్ర గ్రహీత ఇంటిపై ఉగ్రదాడి..సైన్యం కాల్పుల్లో టెర్రరిస్టు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ రాజౌరీ జిల్లాలోని ఖవాస్ తహసీల్‌లోని గుండా ప్రాంతంలో శౌర్యచక్ర అవార్డు గ్రహీత పర్షో్త్తమ్ కుమార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం తెల్లవారు జామున 3:10 గంటల సమయంలో ఆయన ఇంటిపై కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే స్పందించి ఉగ్రవాదులపై కాల్పులు జరపగా ఓ టెర్రరిస్టు మరణించాడు. అలాగే ఓ జవాన్, పౌరుడు గాయపడ్డారు. ఘటన తర్వాత మరిన్ని భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే 4గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మీ పికెట్ పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపగా.. ఈ దాడిని భద్రతా దళాలు విఫలం చేశాయి.

కశ్మీర్‌లో 40 మంది పాక్ ఉగ్రవాదులు!

దాదాపు 40 నుంచి 50 మంది పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కొండ జిల్లాల్లో దాక్కున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉగ్రవాదులు అత్యున్నత శిక్షణ పొంది, అమెరికా తయారు చేసిన ఎం4 కార్బైన్ రైఫిల్స్‌తో సహా అత్యంత ఆధునిక ఆయుధాలను కలిగి ఉన్నారని పేర్కొన్నాయి. అంతేగాక వారి వద్ద బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నట్టు సమాచారం. అయితే వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఇఫ్పటికే భారీ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed