Rajya Sabha: రాజ్యసభలో నోరుపారేసుకున్న ఖర్గే..!

by Shamantha N |
Rajya Sabha: రాజ్యసభలో నోరుపారేసుకున్న ఖర్గే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాజ్యసభలో(Rajya Sabha) కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే(Congress president Mallikarjun Kharge) నోరుపారేసుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఆవేశంతో బీజేపీ ఎంపీ(BJP MP)పై విరుచుకుపడ్డారు. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తున్న సమయంలో మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారుడు, బీజేపీ ఎంపీ నీరజ్ శేఖర్(Neeraj Shekhar) అడ్డుకున్నారు. దీంతో, ఆవేశానికి లోనై, సహనం కోల్పోయిన ఖర్గే.. ఆయనపై విరుచుకుపడ్డారు. ఖర్గే మాట్లాడుతూ..‘నేను మీ తండ్రి సహచరుడిని. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌?. నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నోరు మూసుకుని కూర్చో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యల వల్ల రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

రాజ్యసభలో గందరగోళం

ఖర్గే వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. రాజ్యసభలో ఉద్రిక్తత నెలకొనగా.. ఛైర్మన్‌ జగదీప్‌ ధంఖర్ కల్పించుకున్నారు. ఇరు వర్గాలను ప్రశాంతంగా ఉండాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేకు సూచించారు. అలాగే, చంద్రశేఖర్‌ ఎంతో ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. నీరజ్ శేఖర్ 2019లో సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమైన సోషలిస్ట్ నాయకులలో ఒకరిగా నిలిచారు. చంద్ర శేఖర్‌.. అక్టోబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆరు నెలలు ప్రధానమంత్రిగా పనిచేశారు.

Next Story

Most Viewed