Tejashwi: మోడీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చు, కానీ టీమిండియా వెళ్లకూడదా.. తేజస్వీ యాదవ్

by vinod kumar |
Tejashwi: మోడీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చు, కానీ టీమిండియా వెళ్లకూడదా.. తేజస్వీ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో పాకిస్థాన్‌(Pakisthan)లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ(champions Trophy)లో భారత్ పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ జనతాదళ్(RjD) నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejaswi yadav) స్పందించారు. స్పోర్ట్స్‌ (Sports)ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పాకిస్థాన్‌లో పర్యటించి నవాజ్ షరీఫ్‌ (Nawaz shareef)తో కలిసి బిర్యానీ తినొచ్చు కానీ టీమ్ ఇండియా మాత్రం పాక్ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. మోడీ టూర్‌కు లేని అభ్యంతరం క్రికెటర్లు వెళ్లడానికి ఎందుకు ఉందన్నారు. ‘క్రీడల్లో పాలిటిక్స్ ఉండకూడదు. పాకిస్థాన్ ప్లేయర్లు మన దేశానికి రావాలి, మన ఆటగాళ్లు కూడా అక్కడికి వెళ్లాలి. క్రీడలు జరిగితే యుద్ధం జరుగుతున్నట్లు కాదు’ అని వ్యాఖ్యానించారు. టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లి క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పుడు పాకిస్థాన్‌లో పర్యటించింది.

Advertisement

Next Story