Scammer: స్కామర్ కి చుక్కలు చూపించిన టెకీ

by Shamantha N |
Scammer: స్కామర్ కి చుక్కలు చూపించిన టెకీ
X

దిశ, నేషనల్ బ్యూరో: సాఫ్ట్ వేర్ చెల్లింపుల పేరుతో బురిడీ కొట్టిందామనుకున్న సైబర్ మోసగాడికి షాక్ తగిలింది. ఆ నేరస్థుడి ల్యాప్ ట్యాప్ నే హ్యాక్ చేసి ఓ టెకీ ఔరా అన్పించాడు. స్కామర్ కు టెకీ చుక్కులు చూపించినట్లుగా ఉన్న వీడియో యూట్యాబ్ లో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కమల్ అనే పేరుతో ఉన్న స్కామర్.. సాఫ్ట్ వేర్ చెల్లింపుల కోసం టెకీని సంప్రదించినట్లుగా వీడియోలో ఉంది. అయితే, సైబర్ మోసగాడితో టెకీ అమాయకుడిగా నటించడం ప్రారంభించాడు. అతనితో కాసేపు మాట్లాడాక సాఫ్ట్ వేర్ కోసం చెల్లింపులు చేయమని అడుగుతాడు. కాగా.. అప్పుడు టెకీ తన సమాచారాన్ని కాకుండా.. కమల్ డీటైల్స్ నమోదు చేసి స్కామర్ కి షాక్ ఇచ్చాడు. దీంతో, కమల్ గందరగోళానికి గురైనట్లు అందులో ఉంది. ఆ తర్వాత టెకీ తాను స్కామర్ ని గత నాలుగు వారాలుగా గమనిస్తున్నానని.. అతని ల్యాప్ టాప్ లోని ప్రైవేట్ చిత్రాలు, డేటా, బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా తన దగ్గర ఉన్నట్లు టెకీ వీడియోలో వివరించాడు.

టెకీపై ప్రశంసలు

ఇకపోతే, టెకీ నైపుణ్యాలను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు కురిపించారు. స్కామర్ తమ దేశానికి చెందినవాడు కావడంతో తాము ఇబ్బందిపడ్డట్లు పలువురు భారతీయులు చెప్పుకొచ్చారు. ఇటీవలే తన తల్లి స్కామర్ల చేతిలో కొంత డబ్బు పోగొట్టుకుంది. ఇది చాలా ప్రశంసనీయం అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మరోవైపు, గత వారం షేర్ ట్రేడింగ్ నవీ ముంబైకి చెందిన వ్యక్తి నుంచి రూ.14.8 కోట్లు కాజేసిన సైబర్ మోసాగాడ్ని బిహార్ లో అరెస్టు చేశారు. మరోవైపు, 2022లో భారతదేశంలో 17,470 సైబర్ నేరాలు నమోదయ్యాయని.. వాటిలో 6,491 ఆన్‌లైన్ బ్యాంక్ మోసం కేసులు ఉన్నాయని కేంద్రం ఇటీవలే వెల్లడించింది.

Advertisement
Next Story

Most Viewed