కౌంటింగ్ పూర్తయ్యాక డేటా డిలీట్ చేయొద్దు.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

by Gantepaka Srikanth |
కౌంటింగ్ పూర్తయ్యాక డేటా డిలీట్ చేయొద్దు.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈవీఎం‌(EVM)లపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు( Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల డేటా ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని పేర్కొంది. డేటాను తప్పకుండా భద్రపర్చాలని ఈసీ(Election Commission)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు.. ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ.. 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఈసీని ఆదేశించింది. మరోవైపు ఈవీఎం-వీవీప్యాట్‌ క్రాస్‌ వెరిఫికేషన్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని ఆదేశించింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది.



Next Story

Most Viewed