- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Supreme court: ఎఫ్ఐఆర్ లేకున్నా ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ పొందొచ్చు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

దిశ, నేషనల్ బ్యూరో: ఎఫ్ఐఆర్ ఫైల్ చేయనప్పటికీ జీఎస్టీ, కస్టమ్స్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయొచ్చని సుప్రీంకోర్టు (Supreme court) స్పష్టం చేసింది. ఆంటిసిపేటరీ బెయిల్ (Anticipatery bail) నిబంధన ఈ రెండు చట్టాలకూ వర్తిస్తుందని తెలిపింది. ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా ఆయన ముందస్తు బెయిల్ నిమిత్తం కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కస్టమ్స్ చట్టంలోని శిక్షా నిబంధనలు, జీఎస్టీ చట్టం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ 2018లో రాధికా అగర్వాల్ (Radhika Agarwal) అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna), న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్ (Sundaresh), బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం గతేడాది మే 16న విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ తీర్పును వెల్లడించింది.
కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Crpc), భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని నిబంధనలు కస్టమ్స్, జీఎస్టీ కేసులకూ వర్తిసాయని బెంచ్ వెల్లడించింది. ఈ చట్టాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా ముందస్తు బెయిల్ పొందే అర్హత కలిగి ఉంటారని పేర్కొంది. జీఎస్టీ కింద సోదాలు, స్వాధీన కార్యకలాపాల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బెదిరింపులకు పాల్పడటాన్ని తాము ఆమోదించబోమని స్పష్టం చేసింది. అటువంటి కార్యకలాపాల్లో పాల్గొన్న అధికారులు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.