Astronaut Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా దీపావళి గ్రీటింగ్స్..వైరల్ గా వీడియో

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-29 05:18:22.0  )
Astronaut Sunita Williams : అంతరిక్షం నుంచి సునీతా దీపావళి గ్రీటింగ్స్..వైరల్ గా వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(Astronaut Sunita Williams) అంతరిక్షం(the space)నుంచే దీపావళి శుభాకాంక్షలు(Diwali greetings) తెలిపారు. దీపావళి శుభాకాంక్షలతో వైట్ హౌస్ కు పంపిన వీడియో సందేశం( Video message sent to the White house)సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఈ ఏడాది నాకు భూమికి 260 మైళ్ల దూరంలో దీపావళి జరుపుకొనే అవకాశం దక్కిందని వీడియోలో తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. భారతీయ పండగల ద్వారా మా నాన్న సాంస్కృతిక మూలాలను మాతో పంచుకొనేవారని గుర్తు చేసుకుంది. వైట్ హౌస్ మా కమ్యూనిటీతో పండగ జరుపుకున్నందుకు ప్రెసిడెంట్ జో బెడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కు థాంక్స్' అని సునీత విలియమ్స్ పోస్ట్ చేసింది. సునీతా విలియమ్స్ 5 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే ఉన్నారు.

శ్వేతసౌధంలోని బ్లూరూమ్ లో దీపావళి వేడుకలు జరిపారు. ఈసందర్భంగా ఆ ప్రదేశాన్ని దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఈ వేడుకలకు దాదాపు 600 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. వీరిలో కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. 2003లో జార్జి బుష్ తొలిసారి శ్వేతసౌధంలో దీపావళి నిర్వహించారు. ఆ తర్వాత బరాక్ ఒబామా స్వయంగా ఓవల్ ఆఫీస్ లో దీపం వెలిగించి పండుగను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సంప్రదాయాన్ని ట్రంప్ కొనసాగించారు. దీపావళి వేడుకల్లో ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ అత్యంత వేగంగా ఎదుగుతున్న అమెరికా ప్రగతిలో అన్నింటా భాగస్వామి అవుతున్న జాతిగా దక్షిణాసియా వాసులు ఉన్నారన్నారు. అమెరికన్ల జీవితాల్లో ప్రతిభాగాన్ని వారు సుసంపన్నం చేశారని కొనియాడారు. ఇప్పుడు దీపావళి వేడుకలు గర్వంగా, ఘనంగా శ్వేతసౌధంలో జరుగుతున్నాయని, ఇది నా ఇల్లు కాదు.. మీదని వ్యాఖ్యానించారు. నా కార్యవర్గం విభిన్నమైన జాతులతో అమెరికాను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ దేశంలో వైవిధ్యం మనదని, మనం చర్చిస్తాం, విభేదిస్తాం కానీ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనే దానిని విస్మరించమంటూ సందేశమిచ్చారు.

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు ఆస్ట్రోనాట్లు బ్యారీ బుచ్ విల్‌మోర్, సునీత విలియమ్స్ ఉన్నారు. వీరిద్దరూ 2024 జూన్ 5న ఎనిమిది రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ లో స్పేస్ లోకి ప్రయాణించారు. అదే జూన్ 14న వారిద్దరు భూమికి తిరిగి రావాల్సిఉంది. కానీ ఐఎస్ఎస్‌కి వెళ్లే మార్గంలో వారి అంతరిక్ష నౌకలో హీలియం లీక్‌ సమస్యను ఎదుర్కొవడంతో తిరిగి అదే మిషన్‌లో తిరిగి రావడం క్షేమం కాదని తేలడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 2025 ఫిబ్రవరిలో వీరిని స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమి మీదకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది నాసా. నవంబర్‌ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీళ్లిద్దరూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

Next Story