- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కు రూ.75 కోట్లు ఇచ్చా.. సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తీహార్ జైలు నుంచి ఓ లేఖ విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ చెప్పినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కు రూ.75 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశాడు. రూ.15 కోట్ల చొప్పున ఐదు సార్లు రూ. 75 కోట్లు కేసీఆర్ కు అప్పజెప్పానని చెప్పాడు. ఈ 75 కోట్లలో రూ.15 కోట్లు బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఓ రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు.
ఈ వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్ తో చేసిన 700 పేజీల వాట్సాప్ చాట్ తన వద్ద ఉందని పేర్కొన్నాడు. కేజ్రీవాల్ అవినీతి అక్రమాలకు ఇది టీజర్ మాత్రనేనని, వారం రోజుల్లో అన్ని బయటపెడతానని చెప్పాడు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మొదటిసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు బయటకురావడం సంచనంగా మారింది. కాగా కేసీఆర్ పై సుఖేశ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. కేసీఆర్ ను అభాసుపాలు చేసేందుకే కుట్రలు పన్నారని, కానీ వాటిని తిప్పికొడుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.