ISRO SpaDeX Mission: 3 మీటర్ల దగ్గరికి వచ్చిన స్పేడెక్స్ శాటిలైట్లు

by Shamantha N |
ISRO SpaDeX Mission: 3 మీటర్ల దగ్గరికి వచ్చిన స్పేడెక్స్ శాటిలైట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: స్పేడెక్స్‌ మిషన్ పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)( ISRO SpaDeX Mission) మరో అప్‌డేట్‌ ఇచ్చింది. ఆదివారం ఉపగ్రహాలు మరింత దగ్గరయ్యాని వెల్లడించింది. శనివారం వీటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉంది. ఆ తర్వాత వీటి దూరం తొలుత 15 మీటర్లకు చేరుకుంది. అయితే, ఆ తర్వాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను 3 మీటర్ల మేరకు దగ్గరకు తీసుకువచ్చి, తరువాత సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకురాగలిగింది. ఎస్‌డీ01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్) శాటిలైట్లు రెండూ సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని తెలిపింది. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసిందని, ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను(Satellite) సురక్షితమైన దూరానికి తరలించామని ఇస్రో సోషల్ మీడియాలో పేర్కొంది.ఈ ‍ప్రయోగానికి సంబంధించిన డేటాను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే అనుసంధాన ప్రక్రియ(డాకింగ్)ను చేపడతామని ఇస్రో వెల్లడించింది. శాటిలైట్లలోని వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతానికి అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని పేర్కొంది.

త్వరలోనే డాకింగ్

ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్‌) ఎప్పుడు చేపడతామన్నది ఇస్రో ఇంకా వెల్లడించలేదు. అయితే, డాకింగ్ ప్రక్రియను జనవరి 7, 9 తేదీల్లో నిర్వహిస్తామని గతంలో ప్రకటించింది.. తర్వాత ప్రయోగాన్ని వాయిదా వేసింది. కాగా.. గతేడాది డిసెంబర్ 30న ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) శాటిలైట్లను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పేడెక్స్ ప్రయోగం(Spadex experiment) పూర్తిగా విజయవంతమైతే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది.



Next Story

Most Viewed