- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
South Korea President : దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పాస్
దిశ, నేషనల్ బ్యూరో : దక్షిణ కొరియా అధ్యక్షుడు(South Korea president) యూన్ సుక్ యోల్‌పై శనివారం పార్లమెంటు(South Korea parliament)లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం పాసైంది. పార్లమెంటులోని మొత్తం 300 మంది ఎంపీలకుగానూ 204 మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 85 మంది ఈ తీర్మానాని(impeached)కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఎనిమిది మంది ఎంపీల ఓట్లు చెల్లలేదు. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ గతవారం దేశంలో మార్షల్ లా (అత్యవసర పరిస్థితి)ను ప్రకటించారు. అయితే అధికార, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సాక్షాత్తూ అధికార పక్షం డిమాండ్ చేస్తున్నా యూన్ సుక్ యోల్ వినిపించుకోవడం లేదు. దీంతో అధికార, విపక్షాలు కలిసి సంయుక్త అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి పాస్ చేయించాయి. ఈ పరిణామం జరిగిన వెంటనే దేశాధ్యక్షుడి ప్రత్యేక అధికారాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ దక్షిణ కొరియా పార్లమెంటు ప్రత్యేక తీర్మానం చేసింది. ప్రధానమంత్రి హాన్ డక్ సూ.. దక్షిణ కొరియాకు తాత్కాలిక దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ప్రకటించింది.
దేశాధ్యక్ష పదవి నుంచి యూన్ సుక్ యోల్ ఆకస్మిక తొలగింపుపై దక్షిణకొరియా రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోగా తీర్పును వెలువరించనుంది. ఒకవేళ ఆయన తొలగింపును న్యాయస్థానం సమర్ధిస్తే.. అభిశంసన తీర్మానం ద్వారా పదవిని కోల్పోయిన రెండో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ పేరు రికార్డులకు ఎక్కుతుంది. ఈ తీర్పు వెలువడిన 60 రోజుల్లోగా దేశాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లోని రోడ్లపైకి వందలాది మంది యూన్ సుక్ యోల్ మద్దతుదారులు చేరుకొని ఆందోళనలు నిర్వహించారు. ఆయననే అధ్యక్షుడిగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వారం క్రితం కూడా యూన్ సుక్ యోల్‌పై దక్షిణ కొరియా పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే అప్పట్లో పెద్దసంఖ్యలో అధికార పీపుల్స్ పవర్ పార్టీ ఎంపీలు గైర్హాజరు కావడంతో ఆయన గట్టెక్కారు. శనివారం మాత్రం అధికార పార్టీ ఎంపీలంతా హాజరై వ్యతిరేకంగా ఓటు వేయడంతో యూన్ సుక్ యోల్ గద్దె దిగాల్సి వచ్చింది.