- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారీ... పొరపాటు మాదే.. ఎంపీ నోటీసుకు ఈడీ రిప్లై
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న ఇటీవల స్పెషల్ కోర్టుకు సమర్పించిన సెకండ్ చార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును ఈడీ ప్రస్తావించింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన తరఫున న్యాయవాది మణీందర్ సింగ్ బేడీ గత నెల 22న ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు లీగల్ నోటీసు ఇచ్చారు. దీనికి ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ గత నెల 30న రిప్లై ఇచ్చారు. సెకండ్ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఒక పేరాలో నాలుగు చోట్ల సంజయ్ సింగ్ పేరు వచ్చిందని, కానీ ఇది పొరపాటు జరిగిన క్లెరికల్ మిస్టేక్ అని స్పష్టత ఇచ్చారు. రాహుల్ సింగ్ అని రావాల్సిన చోట సంజయ్ సింగ్ అని వచ్చిందని, దీన్ని గుర్తించిన వెంటనే కోర్టుకు కూడా రాతపూర్వకంగా విషయాన్ని వివరించామని తెలిపారు. సంజయ్ సింగ్ తరఫున న్యాయవాది నుంచి లీగల్ నోటీసు రావడానికి ముందే ఈ పొరపాటును గుర్తించి దిద్దే ప్రాసెస్ మొదలైందని క్లారిటీ ఇచ్చారు.
ఈ పొరపాటును ప్రామాణికంగా తీసుకుని ఈడీ దర్యాప్తు ప్రక్రియే అసమంజసం అనే తీరులో లీగల్ నోటీసులో పేర్కొని సంస్థ ప్రతిష్టనే దిగజార్చే తీరులో చేసిన వ్యాఖ్యలు ఆవాంఛనీయమని ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ ఆ రిప్లైలో పేర్కొన్నారు. రీజినల్ హెడ్ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాతనే కోర్టుకు చార్జిషీట్‌ను సమర్పించినట్లు హుస్సేన్ పేర్కొని, దీనికి ఈడీ డైరెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఒకవైపు దర్యాప్తు జరుగుతూ ఆ వ్యవహారం కోర్టు పరిధిలో సబ్‌జ్యుడిస్ మేటర్‌గా ఉన్నప్పుడు సంజయ్ సింగ్ మీడియా ద్వారా కామెంట్లు చేయడం అవాంఛనీయమని, మరోసారి ఇలాంటి కామెంట్లు చేయరాదని ఆ రిప్లైలో నొక్కిచెప్పారు.