- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ED దూకుడు.. సోనియా, రాహుల్‌కు మరో BIG షాక్

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్(ED Chargesheet) దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)ల పేర్లను చేర్చారు. ఇప్పటికే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ఆయా ఆస్తుల్లో ఉన్న వారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్న వారు ఇక నుంచి తమకు ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను గతంలో ప్రచురించిన ఏజేఎల్ సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ.2 వేల కోట్లు ఉంటుందని, ఈ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా సోనియా, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు కేవలం రూ.50 లక్షలకే అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. యంగ్ ఇండియన్ సంస్థలో సోనియా, రాహుల్‌లకు చెరో 38 శాతం వాటాలు ఉన్నాయని గుర్తించింది.