- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kumbh express: కుంభ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయాందోళనతో ప్రయాణికుల పరుగులు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: కుంభ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ఒక్కసారిగా పొగలు వ్యాప్తించాయి. వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు భయాందోళనతో ట్రైన్ దిగి పరుగులు తీశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని త్రివేదిగంజ్ ప్రాతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్ నుంచి లక్నో వెళ్తున్న కుంభ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు చక్రాలకు ఒక్కసారిగా మంటలు, పొగలు వచ్చాయి. పోగలు వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది.
రైలు ఆగిన వెంటనే భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకి బయటకు పరుగులు తీశారు. అనంతరం రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పొగను అదుపులోకి తెచ్చారు. సుమారు గంట తర్వాత రిపేర్ చేసి.. రైలును గమ్యస్థానానికి తరలించారు. ఈ సమయంలో రైలు నుంచి కిందకు దిగిన ప్రయాణికులు ఎండ వేడిమికి తల్లడిల్లిపోయారు.
ఎండ తీవ్రత, రైలు చక్రాలు రాపిడి వల్లే మంటలు, పొగలు వచ్చాయని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రైలు బోగీకి ఎలాంటి నష్టం జరగలేదని, ప్రయాణికులు సేఫ్‌గా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.