- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sitharaman: ఏఐ స్వీకరణలో భారత్ ముందంజ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) స్వీకరణలో భారత్ ముందంజలో ఉండటమే గాక దానిని ఉపయోగించే విధానాన్ని కూడా రూపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. కేరళలోని కొట్టాయంలో శనివారం జరిగిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ఆరో స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు. దానిని దుర్వినియోగం చేయొద్దని, అనైతికంగా వినియోగించొద్దని స్పష్టం చేశారు. భారత్ కేవలం ఏఐతో ప్రయోగాలు మాత్రమే చేయడం లేదని, వాటాదారుల నుంచి ఇన్‌పుట్‌లను తీసుకుంటుందని నొక్కి చెప్పారు. ఏఐకి తగిన ప్రాముఖ్యత లభించేలా చూసుకోవడానికి నిరంతరం విధానాలను రూపొందిస్తోందని వెల్లడించారు.
2024లో దేశం మూడు బిలియన్ల ఏఐ సంబంధిత యాప్ డౌన్‌లోడ్‌లను నమోదు చేయగా, అమెరికా 1.5 బిలియన్లు, చైనా1.3 బిలియన్ డౌన్‌లోడ్‌లను మాత్రమే కలిగి ఉందన్నారు. దీంతో ఏఐపై భారత్ స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తోందని కొనియాడారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు భారత్ పాల్గొనడం ఈ రంగంలో దేశ ప్రపంచ స్థానాన్ని గుర్తిస్తుందన్నారు. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకింగ్ 2015లో 81వ స్థానంలో ఉండగా, 2024 నాటికి 133 దేశాల్లో 39వ స్థానానికి చేరుకుందని గుర్తు చేశారు. ఈ విజయాలన్నీ దేశం సరైన దిశలో పయనిస్తోందనడానికి నిదర్శనమని నొక్కి చెప్పారు.