Sitharaman: పితృస్వామ్యం అడ్డుపడితే ఇందిర ప్రధాని ఎలా అయ్యారు?.. నిర్మలా సీతారామన్

by vinod kumar |
Sitharaman: పితృస్వామ్యం అడ్డుపడితే ఇందిర ప్రధాని ఎలా అయ్యారు?.. నిర్మలా సీతారామన్
X

దిశ, నేషన్ బ్యూరో: భారత్‌లోని మహిళలు ముందుకు వెళ్లడానికి పితృస్వామ్య భావజాలం అడ్డుకుంటే ఇందిరాగాంధీ దేశానికి ఎలా ప్రధాని అయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala seetharaman) ప్రశ్నించారు. పితృస్వామ్యం అనేది వామపక్షాలు సృష్టించిన భావన అని తెలిపారు. బెంగళూరులోని సీఎంఎస్ బిజినెస్ స్కూల్(Business school) విద్యార్థులతో సీతారామన్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. పితృస్వామ్యం అనేది వామపక్షాలు రూపొందించిన సిద్ధాంతమన్నారు. పట్టుదలతో పోరాడి, అద్భుతమైన పదాలతో లాజికల్‌గా మాట్లాడితే పితృస్వామ్యం మహిళల కలలను సాధించకుండా ఆపబోదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇదే భావన అడ్డుపడితే ఇందిరా గాంధీ (Indira Gandhi) దేశానికి ఎలా పీఎం ఎలా అయ్యారని ప్రశ్నించారు. అయితే, మహిళలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందడం లేదని, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తాం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీనికోసం ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే కేబినెట్ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం100 కోట్ల వరకు టర్మ్-లోన్ కోసం కొలేటరల్-ఫ్రీ గ్యారెంటీని కవర్ చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed