- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
దిశ, డైనమిక్ బ్యూరో: కోవిడ్-19 టీకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యాక్సిన్ ను ఉపయోగించిన వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోవడ వంటి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఈ వ్యాక్సిన్ ను తయారు చేసిన బ్రిటన్ కు చెందిన ఫార్మా ఆస్ట్రాజెనెకా అక్కడ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీకాను భారత్ లో విస్తృతంగా వినియోగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలనకు వైద్య నిపుణల కమిటి ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్ పై సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన, వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.