- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BL Santhosh :బీఎల్ సంతోష్‌కు షాక్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు మరోసారి 41 సీఆర్పీసీ ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని అదనపు ఏజీకి హైకోర్టు సూచించింది. నోటీసులను నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ మెయిల్ ద్వారా ఇవ్వవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన నోటీసుల గురించి ఇప్పుడు అవసరం లేదని తాజాగా మరోసారి ఇచ్చి డేట్ ను ఫిక్స్ చేసి విచారణకు తీసుకోవాలని సూచించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ హైకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా ఈ కేసుతో సంబంధం ఎవరికి ఉన్నా వారికి నోటీసులు ఇస్తామని ఏజీ స్పష్టం చేశారు. సిట్ ముందుకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని, బీఎల్ సంతోష్ ఎందుకు రాకూడదు? విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు. బీఎల్ సంతోష్ ఉద్దేశపూర్వకంగానే విచారణకు రాకుండా ఎగ్గొడుతున్నాడని ఏజీ వాదించారు. బిఎల్ సంతోష్ తరఫున రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ సిట్ ఉత్తర్వులను సంతోష్ ధిక్కరించలేదని చెప్పారు. ప్రస్తుతం బీఎల్ సంతోష్ గుజరాత్ ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారని అవి పూర్తయిన తర్వాత హాజరయ్యేలా నోటీసులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణకు బీఎల్ సంతోష్ రాకపోతే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏజీ అభిప్రాయపడ్డారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది.