Sheikh Hasina : నా ప్రభుత్వాన్ని కూల్చింది యూనుసే.. షేక్ హసీనా సంచలన ఆరోపణలు

by Hajipasha |
Sheikh Hasina : నా ప్రభుత్వాన్ని కూల్చింది యూనుసే.. షేక్ హసీనా సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహ్మద్ యూనుస్‌(Muhammad Yunus)పై మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) సంచలన ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన హింసాత్మక ఉద్యమానికి ప్రధాన సూత్రధారి మహ్మద్ యూనుసే అని ఆమె ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన పకడ్బందీగా కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. యునైటెడ్ కింగ్‌డమ్ అవామీ లీగ్ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తూ హసీనా ఈ ఆరోపణలు చేశారు.

‘‘నేను ప్రధానిగా ఉన్న టైంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. వారి డిమాండ్లకు నేను అంగీకరించాను. అయినా విద్యార్థులు ఆగలేదు. చివరకు హింసాకాండకు దిగారు. తెర వెనుక నుంచి వాళ్లను ఆ దిశగా రెచ్చగొట్టింది యూనుసే. అధికార దాహంతోనే ఆయన అలా చేశారు’’ అని హసీనా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు పూర్తిస్థాయి భద్రత ఉండేదన్నారు. కానీ ఇప్పుడు మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె చెప్పారు.



Next Story

Most Viewed