- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Shivakumar: పార్టీ మార్పు ఊహాగానాలపై స్పందించిన డీకే

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలను ఆయన ఖండించారు. బీజేపీ వాళ్లే తనతో టచ్ లో ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీ నేతలే కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ముందు బీజేపీ (BJP) తన ఇంటిని సరిదిద్దుకోనివ్వండి. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా వెల్లడించారు. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదు’ అని పేర్కొన్నారు. అయితే, ఇటీవలే ఈషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్, కేంద్రహోంమంత్రి అమిత్ షా కలవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపైనే డీకే స్పందించారు. ఆ ప్రోగ్రాం రాజకీయం కాదని, ఆధ్యాత్మికమైనందని స్పష్టం చేశారు. సద్గురు ఆహ్వానిస్తేనే ఆ కార్యక్రమానికి వెళ్లాలని చెప్పారు. ఆయన కావేరీ జలాల కోసం కూడా పోరాడుతున్నట్లు గుర్తుచేశారు.
అమిత్ షా తో భేటీ
మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాగా.. ఆ ప్రోగ్రాంలో అమిత్ షాతో పాటు డీకే పాల్గొన్నారు. అయితే, డీకే బీజేపీకి దగ్గరవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇదే కాంగ్రెస్ (Congress) వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. కాగా.. బీజేపీ లీడర్, ప్రతిపక్ష నేత ఆర్ అశోకా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో డీకే శివకుమార్‌ను పోల్చారు. అయితే, డీకే పార్టీ మారతారని వస్తున్న వార్తలను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఊహాగానాలపై డీకే కూడా క్లారిటీ ఇచ్చారు.