- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UGC NET 2024: యూజీసీ - నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంచలన విషయాలు.. క్లిప్స్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: నీట్, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. యూజీసీ-నెట్ పరీక్ష మంగళవారం జరగ్గా.. దానికి రెండు రోజుల ముందే పరీక్షా పత్రం లీక్ అయిందని, ఆ వెంటనే ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియాలో అమ్మకానికి ఉంచారని సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన విషయం విదితమే. ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫ్లాట్‌ఫామైన టెలిగ్రామ్ యాప్ ద్వారా రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు యూజీసీ - నెట్ ఎగ్జామ్ పేపర్ అమ్ముడుపోయినట్టు తెలిసింది. దీనిపై తాజాగా టెలిగ్రామ్ రియాక్ట్ అయింది. ప్రశ్నప్రతం లీక్‌తో ప్రమేయం ఉన్న చానెళ్లపై చర్యలు తీసుకున్నట్లు ఓ జాతీయ మీడియాకు తెలిపింది.
ఈ క్రమంలోనే పరీక్ష పత్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన చానెళ్లను బ్లాక్ చేసినట్లు టెలిగ్రామ్ పేర్కొంది. దేశ చట్టాలకు లోబడి, దర్యాప్తునకు సహకరిస్తున్నారని వెల్లడించింది. కాగా, టెలిగ్రామ్ సంబంధించిన యూజీసీ నెట్ పేపర్ లీక్ చానెళ్ల క్లిప్స్ అంటూ సోషల్ మీడియాలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి.