- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
SC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్న పిటిషన్ రిజెక్ట్

దిశ, నేషనల్ బ్యూరో: 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియాను బ్యాన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలన్న పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతేకాకుండా, ఈ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌తో కూడిన ధర్మాసనంకీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది ఒక పాలసీకి సంబంధించిన విషయం. దీనిపై చట్టం చేయమని మీరు పార్లమెంట్‌ను కోరండి. ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం అంగీకరించలేం. దీనికి పరిష్కారం విధానపరమైన నిర్ణయం పరిధిలో ఉంది’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనర్లు సంబంధిత విభాగానికి వినతి చేసేందుకు అవకాశాన్నిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఒకవేళ ఇప్పటికే సంబంధిత విభాగానికి అర్జీ పెట్టుకొని ఉంటే.. వారు దాన్ని 8 వారాల్లో పరిష్కరించాలని న్యాయస్థానం పేర్కొంది.
జెప్ ఫౌండేషన్..
కాగా.. ఈ పిటిషన్‌ను జెప్ ఫౌండేషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో పిల్లలను గుర్తించేందుకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటుచేసేలా కేంద్రం, ఇతరులకు మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరింది. దీంతోపాటు చిన్నారులకు సోషల్ మీడియాలో యాక్సెస్‌ను నియంత్రించాలని కోరింది. పిల్లల భద్రత కోసం ఏర్పాటుచేసిన నిబంధనలను ఉల్లంఘించిన సోషల్ మీడియా సంస్థలకు భారీగా జరిమానాలు విధించాలని పిటిషనర్లు కోర్టుని కోరారు పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహిని ప్రియా వాదించారు.