- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saundala: మహిళలను కించపరిచే తిట్లపై నిషేధం.. ఆ గ్రామం చారిత్రాత్మక నిర్ణయం!
దిశ, నేషనల్ బ్యూరో: మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర (Maharashtra)లోని అహల్యానగర్ (Ahalya nagar) జిల్లాలో ఉన్న సౌందాల గ్రామం (Saundala village) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయంలో అసభ్య పదజాలం వాడటాన్ని నిషేధించింది. మరీ ముఖ్యంగా మహిళల గౌరవాన్ని పణంగా పెట్టే తిట్లపై కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులంతా డిసైడ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం గ్రామసభలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. గొడవలు జరిగిన సమయంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం పూర్తిగా బ్యాన్ చేశారు. ఒక వేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధించాలని తీర్మానించారు. దుర్భాషలాడటాన్ని వెంటనే ఆపాలని గ్రామస్తులకు సూచించారు. దీంతో ఈ గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
గ్రామంలో వాదనల సమయంలో తల్లులు, సోదరీమణులను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడటం సర్వసాధారణమైందని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని గ్రామ సర్పంచ్ శరద్ అర్గాడే (Sharad Argade ) తెలిపారు. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు గ్రామస్తులంతా ముందు కొచ్చి తీర్మానాన్ని ఆమోదించినట్టు చెప్పారు. కాగా, ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పటికే పలు సామాజిక, మతపరమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఊరిలో భర్త చనిపోయిన స్త్రీలు మంగళసూత్రాన్ని తీసేయడం, గాజులు పగులగొట్టడం అనే సంప్రదాయాన్ని కూడా నిషేధించినట్టు ఆర్గాడే చెప్పారు. గ్రామస్తులందరూ ఈ నిర్ణయాలను గౌరవించి తప్పకుండా పాటిస్తారని తెలిపారు. 2007లో ఈ గ్రామం వివాద రహిత విలేజ్‌గా రాష్ట్ర స్థాయి అవార్డు పొందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 1800 మంది ఉన్నారు.