- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Satyendar Jain: ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు షాక్.. ఆ స్కామ్‌లో కేసు నమోదు చేసిన ఏసీబీ

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Sathyendar jain)కు షాక్ తగిలింది. సీసీటీవీ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఢిల్లీ ప్రభుత్వ యాంటీ కరప్షన్ బ్రాంచ్ (ACB) ఆయనపై కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సంబంధిత అధికారి నుంచి ఆమోదం పొందిన తర్వాత సత్యేందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ (Madur varma) తెలిపారు. ఢిల్లీలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేసినందుకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)పై విధించిన రూ.16 కోట్ల లిక్విడేటెడ్ నష్టపరిహారాన్ని రూ.7 కోట్ల లంచం తీసుకుని జైన్ మాఫీ చేశారని ఆరోపణలున్నాయి. అంతేగాక ఈ ప్రాజెక్టును నాసిరకంగా అమలు చేశారని, దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయని వర్మ తెలిపారు.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.4 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి రూ.571 కోట్ల విలువైన ప్రాజెక్టును ఆమోదించి బీఈఎల్‌కు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే సీసీ కెమెరాల ఏర్పాటులో జాప్యం కారణంగా ఆసంస్థకు రూ.16 కోట్ల జరిమానా విధించారు. కానీ సత్యేందర్ జైన్ రూ.7 కోట్లు లంచం తీసుకుని ఈ ఫైన్‌ను మాఫీ చేశారని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన కథనాన్ని ఓ వార్తా సంస్థ ప్రచురించడంతో వెలుగులోకి వచ్చింది. 2023 నుంచి ఇది పెండింగ్‌లో ఉండగా తాజాగా కేసు నమోదు కావడం గమనార్హం.
Read More..
Zelensky: విద్యుత్ గ్రిడ్‌లపై రష్యా దాడులు చేస్తూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ