మంచు కొండల మధ్యలో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-22 13:09:09.0  )
మంచు కొండల మధ్యలో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కశ్మీర్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ బ్యాట్లు తయారు చేసే పరిశ్రమను సందర్శించారు. అనంతరం మంచు కొండల నడుమ గుల్ మార్గ్ పరిసరాల్లో రోడ్డపైనే స్థానిక యువతతో క్రికెట్ ఆడి సందడి చేశాడు. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి సరిహద్దు అయిన అమన్ సేతు బ్రిడ్జిని సైతం సచిన్ సందర్శించారు.

అమన్ సేతు పక్కనే ఉన్న కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ కాసేపు సరదాగా మాట్లాడారు. అయితే రోడ్డుపైనే సచిన్ క్రికెట్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, వీడియోలో సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా భద్రతా బలగాలు చుట్టూ మోహరించి పహారా కాశాయి. చివరగా బ్యాట్‌ను రివర్స్ చేసి హ్యాండిల్‌తో కూడా సచిన్ షాట్ ఆడారు. సచిన్ బ్యాటింగ్ స్టైల్‌కు స్థానికులంతా ఫిదా అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed