చైనా విషయంలో నెహ్రూను పటేల్ హెచ్చరించారు: ఎస్ జైశంకర్

by S Gopi |
చైనా విషయంలో నెహ్రూను పటేల్ హెచ్చరించారు: ఎస్ జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా విషయంలో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నహ్రూను సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. నెహ్రూ చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరించేవారన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. అమెరికా, చైనాలతో సంబంధాలు, భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడారు.

ఈ సదర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి.. 'చైనా పట్ల మాజీ ప్రధాని నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానం బుడగ లాంటిది. ఆయనకు అమెరికాకు వ్యతిరేకంగా ఉండేవారు. దానివల్లే భారత్‌కు చైనా మంచి మిత్ర దేశమన్నారు. ఆ సమయంలో అందరూ దాన్ని నమ్మారు. ఇప్పటికి కూడా అదే చెబుతున్నారు. కానీ చైనా స్నేహాన్ని ఉదాసీనంగా చూడవద్దని పటేల్ చాలాసార్లు హెచ్చరించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం పాకిస్తాన్, చైనా విషయంలో అప్పటి మంత్రులు పటేల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీలు ఆందోళనలు వ్యక్తం చేశారు. కానీ, నెహ్రూ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. హిమాలయాల మీద నుంచి ఆక్రమణకు ప్రయంతం చేస్తారని భావించట్లేదన్నారు. కానీ, చైనా దీన్ని 1962లో అతిక్రమించింది. అంతకుముందు 1950లోనూ భారత్, అమెరికా దూరమవడానికి కూడా చైనాయే కారణం. ఈ విషయంపైనా అప్పటి న్యాయశాఖ మంత్రి డా బీ ఆర్ అంబేడ్కర్ ప్రశ్నించారు. అవన్నీ ఇప్పటి తరానికి తెలియవని, తర్వాతి పాలకులు నెహ్రూ విదేశాంగ విధానాలనే అనుసరించారు. కంపెనీల్లో ఆడిట్ వ్యవస్థ ఉన్న తరహాలోనే దేశాలు అనుసరించే విధానాలకు ఆడిట్ అవసరమని' వెల్లడించారు.

తన సొంత విధానాల గురించి కూడా చర్చించడానికి సంతోషిస్తానని జైశంకర్ అన్నారు. 'నేను మీతో గత 10 సంవత్సరాల గురించి చర్చించాలనుకుంటున్నాను అని ఎవరైనా చెబితే నేను కూడా సంతోషిస్తాను. నా రికార్డులను కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని' ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed