రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్ స్కీ కీలక నిర్ణయం

by samatah |
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్ స్కీ కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ ఆక్రమిత నగరం అవిడివ్కా నుంచి ఉక్రెయిన్ సైన్యం వెనక్కి వెళ్లింది. ఈ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రష్యా సైన్యం తమ బలగాలను చంపడానికి వెనకాడటం లేదని ఉక్రేనియన్ ఆర్మీ జనరల్ అలెగ్జాండర్ టార్నావ్స్కీ తెలిపారు. అందుకే ఉక్రెయిన్ దళాలను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. సైనికులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. యుద్ధంలో భాగంగా రష్యా అవడివ్కాను గతేడాది స్వాధీనం చేసుకుంది. 32,000 జనాభా ఉండే ఈ నగరంలో యుద్ధం కారణంగా అనేక మంది పారిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్సులో శనివారం మాట్లాడుతూ..మా ప్రజలను రక్షించడమే అత్యంత ముఖ్యమైన పని చెప్పారు. సైనికుల ప్రాణాలను కాపాడటానికి తూర్పు ఫ్రంట్‌లైన్ సిటీ అవిడివ్కా నుంచి దళాలను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రష్యా దేనినీ స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కాగా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే 70వేల మందికి పైగా సైనికులు మరణించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story