- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ukraine: ఉక్రెయిన్ పై ఖండాతర క్షిపణి ప్రయోగించిన రష్యా
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా తొలిసారి ఉక్రెయిన్‌పై (Ukraine) ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిసైల్(ICBM) తో దాడి చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ (Ukraine Crisis) ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. డెనిపర్ నగరంలో దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే, కచ్చితంగా ఏ రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు ఎక్స్-47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షపణిని కూడా వాడినట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. చెప్పాల్సింది ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇది తమ జవాన్లను అడగాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ కి అమెరికా అండ
ఇకపోతే, ఖండాంతర క్షిపణి(ICBM)ని దీర్ఘశ్రేణి ఆయుధంగా పరిగణిస్తారు. కనీసం 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంటేనే వాటిని ప్రయోగిస్తారు. ఉక్రెయిన్‌కు అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులను అందించింది. వాటిని రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు కీవ్ కు అనుమతి ఇస్తున్నట్లు గతంలో బైడెన్ సర్కారు ప్రకటించింది. ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) మండిపడ్డారు. అణ్వాయుధాల ప్రయోగాన్ని సులభతరం చేసేలా ఒప్పందంపైనా సంతకం చేశారు. అలానే, ఉక్రెయిన్ కు సాయం చేసే దేశాలను శత్రుదేశాలుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఇలాంటి పరిణామాల మధ్యనే దాడి జరగడం గమనార్హం. మరోవైపు, బుధవారం కీవ్ లోని అమెరికా రాయబార కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో మిసైల్ దాడి జరుగవచ్చని వాషింగ్టన్ ప్రకటించింది. కీవ్ లోని దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది.