Rishi Sunak: జైపూర్ లో ఘనంగా లిటరేచర్ ఫెస్టివల్

by Shamantha N |   ( Updated:2025-02-01 14:29:10.0  )
Rishi Sunak: జైపూర్ లో ఘనంగా లిటరేచర్ ఫెస్టివల్
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌ మాజీ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) శనివారం జైపుర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. జైపుర్‌లోని ఐకానిక్ హోటల్ క్లార్క్స్ అమెర్‌లో గురువారం లిటరేచర్ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలువురు రాజకీయ, సినీ, సాహిత్య ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేశారు. శనివారం 300మందికి పైగా ప్రముఖులు హాజరవ్వగా వారిలో రిషి సునాక్ కూడా ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి(Narayana Murthy), ఆయన సతీమణి సుధామూర్తి, వారి కుమార్తె, అక్షతా మూర్తి, యూఎస్ దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి వంటివారు హాజరయ్యారు. వివిధ సమకాలీన సమస్యలపై ఆలోచనాత్మక చర్చల్లో పాల్గొన్నారు. కాగా.. సుధామూర్తి మై మదర్, మై సెల్ఫ్ అనే సెషన్ ను నిర్వహించారు.

ఆసక్తికర సన్నివేశం..

అయితే, లిటరేషన్ ఫెస్ట్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. రిషి సునాక్‌ కూర్చొని కార్యక్రమానికి హాజరయిన వారికి అభివాదం చేస్తుండగా సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి ఆయనను వారించి లేచి అందరికీ నమస్కారం చేయాలని సూచించారు. వెంటనే సునాక్‌ లేచి నిలబడి అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అందరూ సరదా నవ్వుకున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గామారింది. ఇకపోతే, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై ఆ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో సునాక్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.


Next Story

Most Viewed