జూలై 18న మళ్లీ తెరవనున్న పూరీ జగన్నాథ్ రత్న భాండాగారం లోపలి గది

by S Gopi |   ( Updated:2024-07-17 16:58:24.0  )
జూలై 18న మళ్లీ తెరవనున్న పూరీ జగన్నాథ్ రత్న భాండాగారం లోపలి గది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం లోపలి గదిని మొదట తెరిచిన నాలుగు రోజుల తర్వాత, ఇన్వెంటరైజేషన్, ఆడిటింగ్ కోసం జూలై 18న మళ్లీ తెరవనున్నట్టు పర్యవేక్షక కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. 46 ఏళ్ల తర్వాత తెరిచిన రత్న భాండాగారంపై ఆడిట్ ప్రక్రియ కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. జూలై 18న ఉదయం 9.51 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య లోపలి గదిని తెరుస్తాం. అందులోని విలువైన వస్తువులను తాత్కాలికంగా స్టోర్ రూమ్‌కు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రూపంలో తీయడం జరుగుతుంది. ఆదివారం బృందం సభ్యులు లోపలి గదిలోని తాళాలను తీయలేకపొవడంతో పగులగొట్టాల్సి వచ్చింది. అందుకని అందులో ఉంచిన చెక్క పెట్టెలను తెరవకూడదని తాము నిర్ణయించాం. 'మేము దాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించిన తర్వాత మరమ్మత్తు పని జరిగింది. తాళం చెవిని జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. రత్న భాండాగారం లోపల ఏదైనా అల్మరా తాళం కనిపించకుండా పోతే తాళాలు పగులగొట్టి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుమతిచిందని ' ఆలయ ప్రధాన కార్యనిర్వహనాధికారి అరవింద పాథి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed