Ramesh: అతిశీ జింకలా తిరుగుతున్నారు.. మరోసారి రమేశ్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యలు

by vinod kumar |
Ramesh: అతిశీ జింకలా తిరుగుతున్నారు.. మరోసారి రమేశ్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi), ఢిల్లీ సీఎం అతిశీ (Athishi)లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత రమేశ్ బిధూరీ (Ramesh bidhuri) మరోసారి అతిశీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వీధుల్లో అతిశీ జింకలా పరుగెడుతున్నారని అన్నారు. బుధవారం ఆయన ఓ ర్యాలీలో భాగంగా మాట్లాడారు. ‘ఢిల్లీ నగరంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వీధుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అనేక సమస్యలు తాండవం చేస్తుంటే గత నాలుగేళ్లలో అతిశీ ప్రజలను కలవడానికి ఎప్పుడూ రాలేదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం అడవిలో జింక పరుగెత్తినట్టు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు’ అని అన్నారు.

అతిశీకి ప్రజలు వీడ్కోలు పలికారని, ఆమె నామినేషన్ వేస్తే 50 మంది కూడా రాలేదని విమర్శించారు. కల్కజీ నియోజకవర్గంలో ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్లి లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాగా, గతంలోనూ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే ప్రియాంక చెంపల్లా రోడ్లు నిర్మిస్తానని, అతిశీ తన తండ్రిని మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Next Story