- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో 10 లక్షల దీపాలతో అలంకరణ
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 10 లక్షల దీపాలతో అలంకరించనున్నట్టు రామజన్మభూమి ట్రస్టు వెల్లడించింది. రామాలయం, రామ్‌కీ పైడి, కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరయు ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ చవానీ, ఇతర ప్రముఖ ప్రదేశాలతో సహా ఏకంగా 100 ఆలయాల్లో ఈ దీపాలు వెలిగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలను ఉపయోగించనున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం సమయంలో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార కార్యకాలయాల్లో దీపాలను వెలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడిచిన ఏడేళ్ల నుంచి అయోధ్యలో దీపోత్సవం నిర్వహిస్తోంది. తొలుత 2017లో 1.71 లక్షల దీపాలతో దీన్ని ప్రారంభించారు. గతేడాది రికార్డు స్థాయిలో 22.23 లక్షల దీపాలను వెలిగించారు. సోమవారం రోజున ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.