- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాతీయ స్మారక చిహ్నంగా రామసేతు
న్యూఢిల్లీ: రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టపర్చాలని సుప్రీంకోర్టు కోరింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవలే విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత గురువారం సుబ్రహ్మణ్య స్వామి వాదనలను ఆలకించింది. ఈ కేసును తాము విచారణకు తీసుకుంటున్నామని, రాతపూర్వక సమర్పణలను కోర్టుముందు ఉంచాలని స్వామిని కోరింది. ఆడమ్స్ బ్రిడ్జిగా పేరొందిన రామ సేతు తమిళనాడు ఆగ్నేయతీరంలోని పంబన్ దీవి నుంచి శ్రీలంక వాయవ్య తీరంలోని మన్నార్ దీవి వరకు వ్యాపించిన సున్నపురాయి గుంటల చెయిన్ మార్గమని తెలిసిందే.
బీజేపీ నేత స్వామి తన వంతుగా వాదనను వినిపిస్తూ రామ్ సేతు ఉనికిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందున తన కేసులో తొలి దశను తానిప్పటికే గెల్చి ఉన్నానని బెంచ్‌కు తెలిపారు. 2017లోనే నాటి కేంద్రమంత్రిని కలిసి తన డిమాండును పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరానని, కాని అప్పటినుంచి ఏమీ జరగలేదని స్వామి కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుంటా, రామసేతు వ్యవహారం పాతదేనని, ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వివరాలను దాఖలు చేసిందీ లేనిదీ తాను పరిశీలించాల్సి ఉందని అందుకు తనకు కాస్త సమయం ఇవ్వాలని కోరారు. న్యాయస్థానం దీనికి అంగీకరించి మెహతాను తన వైఖరిని తెలపాలని కోరింది.
తర్వాత జస్టిస్ చంద్రచూడ్ స్వామిని ప్రశ్నించారు. ఇది పాలసీ వ్యవహారం కాబట్టి కేంద్రాన్ని నిర్ణయించనివ్వండి అని కోరారు. స్వామి దానికి స్పందిస్తూ పాలసీ ఇప్పటికే ఉందని, నిర్దిష్ట తేదీలోపల నిర్ణయించాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. వివాదాస్పదమైన సేతుసముద్రం షిప్ చానెల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సుబ్రహ్మణ్య స్వామి.. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలంటూ కోర్టులో లేవనెత్తారు. వాస్తవానికి సేతుసముద్రం షిప్ చానెల్ ప్రాజెక్టును యూపీఏ-1 ప్రభుత్వం చేపట్టింది. సామాజిక, ఆర్థిక అనుకూలతల కారణంగా, రామసేతుకు నష్టం కలగకుండా మరొక మార్గాన్ని కనుగొనడం తనకు ఇష్టమేనని నాటి కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.