- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రామయ్యను ప్రతిష్ఠించే శుభ ముహూర్తం ఇదిగో
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన చేసే శుభ ముహూర్తం వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన అయోధ్యలో ‘అక్షత్ పంపిణీ’ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘జనవరి 22న అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా రామభక్తులు రామ హారతి కార్యక్రమం నిర్వహించి, స్థానికంగా ఎక్కడికక్కడ ప్రసాదం పంపిణీ చేసి సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగించాలి’’ అని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రపంచం మొత్తానికి ఇదే విధమైన విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇక అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల పొడవున్న బాలరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశామని చంపత్ రాయ్ తెలిపారు.
బాలరాముడి విగ్రహం ఇలా ఉంటుంది..
అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న రామయ్య విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో ఉంటుంది. ‘‘రాముడి కళ్లు తామరరేకుల మాదిరిగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుంది. మోకాళ్ల వరకు విస్తరించి ఉన్న పొడవాటి చేతులతో విగ్రహం తయారైంది. దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ విగ్రహంలో దశరధ కుమారుడు, విష్ణుమార్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు’’ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంపత్ రాయ్ వివరించారు.