Rajiv Kumar: తదుపరి సీఈసీగా జ్ఞానేష్ కుమార్.. త్వరలోనే ఎంపిక చేయనున్న కమిటీ!

by vinod kumar |
Rajiv Kumar: తదుపరి సీఈసీగా జ్ఞానేష్ కుమార్.. త్వరలోనే ఎంపిక చేయనున్న కమిటీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv kumar) పదవీ కాలం ఫిబ్రవరి 18న ముగియనుంది. దీంతో ఈ టైం కన్నా ముందే కొత్త సీఈసీని కేంద్ర ప్రభుత్వం నియమించనున్నట్టు తెలుస్తోంది. సీఈసీ ఎంపిక కోసం ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం లేదా సోమవారం సమావేశం కానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjunram meghval), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) కూడా సమావేశానికి హాజరుకానున్నారు. కమిటీ సిఫార్సు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తదుపరి సీఈసీని నియమిస్తారు. అయితే సీఈసీ, ఈసీల ఎంపికను నియంత్రించే కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 19న విచారించనుంది. దీనికి ఒక రోజు ముందే నూతన సీఈసీ ఎంపిక ప్రక్రియ ప్రారంభమవడం గమనార్హం. కాగా, 2020 మేలో రాజీవ్ కుమార్ సీఈసీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన పలు కీలక ఎన్నికలను నిర్వహించారు.

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్ తర్వాత అత్యంత సీనియర్ ఈసీగా జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. ఆయన పదవీ కాలం జనవరి 25, 2029 వరకు ఉంది. దీంతో ఆయననే తదుపరి సీఈసీగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జ్ఞానేష్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా, 2019లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు. దీంతో ఆయన పేరునే ఎంపిక కమిటీ సిఫార్సు చేయనున్నట్టు సమాచారం.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed