- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
New CEC : కొత్త సీఈసీ అభ్యర్థిపై రాహుల్ అభ్యంతరం

దిశ, వెబ్ డెస్క్ : భారత కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్(New CEC) అభ్యర్థిపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(LOP Rahul Gandhi) అభ్యంతరం తెలిపారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్(Rajeev Kumar) పదవీకాలం ఫిబ్రవరి 18న ముగుస్తుండటంతో తదుపరి సీఈసీ ఎన్నికపై నేడు ప్రధాని నివాసంలో ప్యానెల్ కమిటీ సమావేశం అయింది. ఈ ప్యానెల్ లో ప్రధాని మోడీ(PM Modi)తో పాటు, లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్(Arjun Meghaval) సభ్యులుగా ఉన్నారు. ఎన్నిక చేయబడిన సభ్యుల నుంచి ఒకరిని షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తిని రాహుల్ గాంధీ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. కాగా ఎన్నికల కమిషనర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున.. తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని రాహుల్ తెలిపినట్టు సమాచారం. అయితే షార్ట్ లిస్ట్ సభ్యుల్లో జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) ముందు వరుసలో ఉండగా.. ఆయన ఎంపికను రాహుల్ ఒప్పుకోలేదని సమాచారం.
డిసెంబర్ 2023లో అమల్లోకి వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ యాక్ట్, 2023 ప్రకారం ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క మొదటి నియామకం. ఈ నిబంధన ప్రకారం మార్చి 2024 లో S.S. సంధు, జ్ఞానేష్ కుమార్‌లు ఎన్నికల కమిషనర్‌లుగా నియమితులయ్యారు. అరుణ్ గోయల్ రాజీనామా, అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ తర్వాత ఏర్పడిన ఖాళీల భర్తీకి ఇద్దరు కమిషనర్లను నియమించారు. CEC, ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కొత్త చట్టబద్ధమైన నిబంధనలను ప్రవేశపెట్టడానికి ముందు.. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమీషనర్‌లలో అత్యంత సీనియర్‌ని సాధారణంగా అత్యున్నత పదవికి అర్హుడిగా గుర్తించి అవుట్ గోయింగ్ CECతో సంప్రదింపుల జరిపి.. బాధ్యతలు ఇస్తారు. కానీ ఇటీవల తీసుకొచ్చిన సెలక్షన్ కమిషన్ యాక్ట్.. ప్రకారం.. ఎంపిక ప్యానెల్‌లోని మెజారిటీ, ఏకాభిప్రాయ నిర్ణయం ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి.