- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rahul Narvekar: మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. ఏకగ్రీవంగా ఎన్నిక !

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ (Rahul narvekar) ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం నార్వేకర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రాష్ట్ర సెక్రటేరియట్‌లోని రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఆయన వెంట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉన్నారు. ఈ క్రమంలో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం లేదని మహావికాస్ అఘాడీ (MVA) కూటమిలోని విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అసెంబ్లీ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఆయన నియామకాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు. స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన వెంటనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. కాగా, గత అసెంబ్లీలోనూ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్ వ్యవహరించారు. రెండున్నరేళ్ల పాటు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేల అనర్హత కేసుల టైంలోనూ స్పీకర్‌గా ఉన్నారు. మరోవైపు తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలని కోరుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.