తొలి ఐదు దశల్లో 40 సీట్లకే రాహుల్ పరిమితం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by samatah |
తొలి ఐదు దశల్లో 40 సీట్లకే రాహుల్ పరిమితం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తొలి 5 దశల్లో ప్రధాని మోడీ 310 సీట్లను అధిగమించారని, అదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 40 సీట్లకే పరిమితమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ‘దేశంలో ఐదు దశల ఎన్నికల పోలింగ్ పూర్తైంది. ఆరో దశ నేడు జరుగుతోంది. మోడీ ఇప్పటికే 310 సీట్లు దాటారు. మిగతా రెండు దశల ఎన్నికల తర్వాత 400 సీట్లు దాటడం ఖాయం. ప్రజలు దాని కోసమే పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు’ అని చెప్పారు. కానీ రాహుల్ 40 సీట్లు కూడా గెలవలేరు అని తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అన్ని సీట్లలో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని దీమా వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. కానీ ఎప్పటికైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను స్వాధీనం చేసుకుంటాం అని వెల్లడించారు. బీజేపీ అణు బాంబులకు భయపడబోదని స్పష్టం చేశారు. ‘రాహుల్, ప్రియాంక గాంధీలు సెలవులు వచ్చినప్పుడు షిమ్లాకు వస్తారు. కానీ రామమందిర వేడుకకు మాత్రం హాజరు కాలేదు. ఎందుకంటే వారి ఓటు బ్యాంకు కోల్పోతారనే భయం ఉంది’ అని విమర్శించారు. ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా ఇండియా కూటమి తేల్చుకోలేక పోతుందన్నారు.

Advertisement

Next Story