Rahul Gandhi : సంభాల్ లో ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక గాంధీ అడ్డగింత

by Shamantha N |
Rahul Gandhi : సంభాల్ లో ఉద్రిక్తత.. రాహుల్, ప్రియాంక గాంధీ అడ్డగింత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ హింస(Sambhal Violence) ఘటన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపుర్‌ సరిహద్దు (Ghazipur border) వద్ద కాంగ్రెస్‌ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు ఆపారు. రాహుల్‌, ప్రియాంక (Priyanka Gandhi) సంభల్‌ పర్యటనకు రెడీ అవ్వడంతో ఉదయం నుంచే ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపుర్‌ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ నేతలు అక్కడికి చేరుకోగా పోలీసులు వారిని ఆపారు. దీంతో, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు, ఈ పరిణామాలతో ఘాజీపుర్‌ సరిహద్దు దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

సంభాల్ హింస

ఇకపోతే, షాహీ ఈద్గా మ‌సీదు వ‌ద్ద గ‌తంలో హ‌రిహ‌ర హిందూ దేవుళ్ల ఆల‌యం ఉన్న‌ట్లు వేసిన పిటిష‌న్ ఆధారంగా స‌ర్వే చేప‌ట్టేందుకు ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశించింది. మ‌సీదులో స‌ర్వే చేయాల‌ని స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వ‌డంతో వారం క్రితం సంభాల్ లో హింస చెలరేగింది. స్థానికులు, పోలీసుల మ‌ధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసలో ఐదుగురు చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ షాహీ ఈద్గా మసీదు కమిటీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.

Advertisement

Next Story

Most Viewed