బడ్జెట్ రూపొందించడంలో అణగారిన వర్గాలకు చోటేది?

by John Kora |
బడ్జెట్ రూపొందించడంలో అణగారిన వర్గాలకు చోటేది?
X

- కొత్త మంది చేతిలోనే బడ్జెట్ రూపొందుతోంది

- ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు

దిశ, నేషనల్ బ్యూరో:

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్ రూపొందించడంతో అణగారిన వర్గాలకు చోటు దక్కలేదని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. బడ్జెట్ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. బడ్జెట్ రూపొందించే ప్రక్రియలో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలకు చోటు దక్కలేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ అంతా కొంత మంది చేతుల్లోనే ఉంటుందని రాహుల్ అన్నారు. శనివారం కేంద్ర మంత్రి ఒక బ్రీఫ్‌కేస్ పట్టుకొని వస్తారు. దాంతో దిగిన ఒక ఫొటో బయటకు వస్తుంది. కానీ ఆ ఫొటోలో ఒక్క దళితుడు, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు చెందిన వారు ఉండరని చెప్పారు. 90 మంది అధికారులు బడ్జెట్ రూపొందిస్తే.. వారిలో ముగ్గురు మాత్రమే ఓబీసీ వర్గానికి చెందినవారని ఆరోపించారు. ఓబీసీలు 50 శాతం మంది ఉంటే.. రేపు ఆ అధికారులు రూ.100ను పంచే సమయంలో మీకు కేవలం రూ.5 మాత్రమే కేటాయిస్తారని రాహుల్ చెప్పారు. మరోవైపు ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్‌పై కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. కేజ్రివాల్ కూడా మైనార్టీ నాయకులను తన బృందంలో చేర్చుకోవడం లేదని అన్నారు. కేజ్రివాల్ టీమ్‌లో తొమ్మిది మంది ఉంటే వారిలో దళితులు, ఆదివాసీలు, బీసీ, మైనార్టీలు లేరని ఆరోపించారు. 10 ఏళ్లుగా యమునా నదిని శుభ్రం చేయలేకపోయారు. శీలా దీక్షిత్ హయాంలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను కేజ్రివాల్ వచ్చిన తర్వాత నాశనం అయ్యాయని ఆరోపించారు. శీలా దీక్షిత్ ఎన్నో రోడ్లు, భవనాలు, బ్రిడ్జిలు, ఫ్లైవోవర్లు నిర్మించారు. కానీ కేజ్రివాల్ మాత్రం వాటిని నాశనం చేశారని మండిపడ్డారు.


Next Story